ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ap_jac_chairman_bopparaju_venkateshwarlu

ETV Bharat / videos

సమస్యల పరిష్కారానికి ఉద్యోగులంతా కలిసి ముందుకు రావాలి: బొప్పరాజు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 14, 2023, 5:08 PM IST

Updated : Nov 14, 2023, 5:24 PM IST

AP JAC Chairman Bopparaju Venkateshwarlu: కాంట్రాక్ట్,  ఔట్​సోర్సింగ్​ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అందరూ కలిసి ముందుకు రావాలని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ అండ్ ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగుల సంఘం.. ఏపీ జేఏసీ అనుబంధ సంఘం.. డిసెంబర్ 10వ తేదీన విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్​లో బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభకు సంబంధించిన గోడ పత్రికను బొప్పరాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తేనే ఉద్యోగుల బలమేంటో ప్రభుత్వానికి తెలుస్తుందని.. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కదిలి రావాలని పిలుపునిచ్చారు.

AP Contract Outsourcing Employees Open Meeting: ఉద్యోగ భద్రత లేదని, కనీస వేతనం లభించడం లేదని, సమాన పనికి సమాన వేతనం కూడా అందడం లేదని.. సమస్యలతో కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. వారి సమస్యల పరిష్కారానికి అందరూ ఏకతాటిపైకి రావాలన్నారు. ఐకమత్యంగా ముందుకు సాగేందుకు మహాసభ ఒక వేదిక కానుందని బొప్పరాజు అన్నారు. కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగుల సభకు ప్రభుత్వ పెద్దలను ఆహ్వానించినట్లు వివరించారు. వారు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Last Updated : Nov 14, 2023, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details