విజయవాడలో డిసెంబర్ 10న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ - విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 11, 2023, 9:02 PM IST
AP JAC Amaravati leader Bopparaju: విజయవాడలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర మహాసభను నిర్వహించనున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి స్పష్టం చేసింది. డిసెంబర్ 10వ తేదీన విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ఈ సభలో.. 26 జిల్లాల నుంచి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు హాజరవుతారని.. ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. విజయవాడలో నిర్వహించిన ఏపీపీటీడీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర స్ధాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఆయన కోరారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీనియారిటీ ప్రాతిపదికన ఇంక్రిమెంట్లు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సంక్షేమ పథకాల వర్తింపు వంటి తదితర అంశాలపై భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సభలోనే రాష్ట్ర కమిటీ నియామకం కూడా ఉండనుందని ఆయన ప్రకటించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి అమరావతి జేఏసీ పోరాడుతుందని బొప్పరాజు స్పష్టం చేశారు.