AP Irrigation Association President: "కృష్ణా జలాల కేటాయింపు పునఃసమీక్షపై.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు వెళ్లాలి"
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 7, 2023, 12:11 PM IST
|Updated : Oct 7, 2023, 12:20 PM IST
AP Irrigation Association President:కృష్ణా జలాల కేటాయింపును పునఃసమీక్షించాలన్న కేంద్రం నిర్ణయంపై.. సాగునీటి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నీటి కేటాయింపులకు సంబంధించి తుది అవార్డు ప్రకటించకుండానే.. మరోమారు కృష్ణా జల వివాదాలు-2 ట్రెబ్యునల్‌కు పునఃసమీక్షకు అప్పగించడం సహేతుకం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయంపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య అధ్యక్షులు దీనిపై స్పందిస్తూ.. ఇది రాష్ట్రానికి తీరని శరఘాతామని అన్నారు. 2020 ఏపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే.. దీనిపై కేసీఆర్ దృష్టిపెట్టారన్నారు. ఉమ్మడి ఆంధ్రకు సుమారు 800 టీఎంసీల జలాలు కేటాయించటం.. 2015లో కేఆర్ఎంబీ సమావేశంలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్.. బచావత్కు అనుగుణంగా చెప్పిందని అన్నారు. 519 టీఎంసీలు ఏపీకి.. 299 టీఎంసీలు తెలంగాణకు కేటాయించింది. దీనిపై ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశమైన వివరాలను గుర్తు చేశారు. ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య తరఫున కోర్టులో కేసులు దాఖలు చేస్తామంటున్న ఆ సంఘం అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణతో ఈటీవీ భారత్ ముఖాముఖి.