ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP_High_Court_Hearing_YS_Jagan_Kodi_Katti_Case

ETV Bharat / videos

హైకోర్టులో కోడికత్తి కేసు - శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా - HC Adjourned Jagan Kodi Kathi Case Petition

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2023, 9:49 AM IST

AP High Court Hearing YS Jagan Kodi Katti Case :ప్రసుత్త ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌ రెడ్డిపై కోడికత్తితో దాడి ఘటన కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.  హత్యాయత్నం కింద కేసు నమోదు చేయడం చెల్లదని నిందితుడు శ్రీనివాసరావు తరఫున సీనియర్‌ న్యాయవాది త్రిదీప్‌ పైస్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు. సెక్షన్‌ 320కింద సైతం కేసు పెట్టడానికి వీల్లేదని పేర్కొన్నారు. దాడి ఘటనలో బాధితుడి జగన్ ఎడమ భుజానికి స్వల్ప గాయమైందని అన్నారు. 

Kodi Katti Case Accused Srinivas Bail Petition inHigh Court :కోడికత్తి ఘటన తర్వాత విశాఖ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణం చేశారని గుర్తు చేశారు. ఆ రోజు సాయంత్రమే ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలో హత్యాయత్నం కింద సెక్షన్‌ 307 ప్రకారం కేసు నమోదు చేయడానికి వీల్లేదని న్యాయవాది త్రిదీప్‌ పేర్కొన్నారు. ఈ దశలో ధర్మాసనం స్పందిస్తూ ఏ ఫైళ్ల ఆధారంగా వాదనలు వినిపిస్తున్నారో వాటిని మెమో రూపంలో కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details