ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP High Court Hearing on Camp Office Shifting to Vizag

ETV Bharat / videos

విశాఖకు కార్యాలయాల తరలింపుపై -హైకోర్టులో విచారణ - కోర్టు తీర్పు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2024, 1:03 PM IST

AP High Court  Hearing on Camp Office Shifting to Vizag: విశాఖకు కార్యాలయాల తరలింపుపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలుపుదల చేయాలని కోరుతూ ప్రభుత్వం వేసిన పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా, నాట్ బి ఫోర్ మి అని తెలిపింది. అప్రొప్రియేట్ బెంచ్ కు పిటీషన్ ను పంపుతామని ధర్మాసనం తెలిపింది. వ్యాజ్యం త్వరగా విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తరపు ఏజీ శ్రీరామ్ న్యాయస్థానాన్ని కోరారు. రాజధాని నుంచి విశాఖకు కార్యాలయాలు నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారని ఇటీవల రాజధాని రైతులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పిటీషన్ పై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపాలని ప్రభుత్వ తరపు ఏజీ కోరారు. త్రిసభ్య ధర్మాసనం పిటీషన్ పై విచారణ జరిపే వరకు, విశాఖ తరలింపు పై తదుపరి చర్యలు చేపట్టొద్దని సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలతో తాము కనీసం సమావేశాలు నిర్వహించుకునేందుకు సైతం అవకాశం లేకుండా పోతుందని, సింగిల్ జడ్జి ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ ప్రభుత్వం వ్యాజ్యం దాఖలు చేసింది.  

ABOUT THE AUTHOR

...view details