ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP_High_Court_Hearing_on_Camp_Office_Shifting_to_Vizag

ETV Bharat / videos

విశాఖకు కార్యాలయాల తరలింపు ఇప్పట్లో లేదు - వ్యాజ్యాలపై విచారణకు త్రిసభ్య ధర్మాసనం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 12:46 PM IST

AP High Court Hearing on Camp Office Shifting to Vizag :ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు పేరుతో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలిస్తున్నారంటూ దాఖలైన వ్యాజ్యాలను విచారణ నిమిత్తం త్రిసభ్య ధర్మాసనానికి నివేదించనున్నట్లు హైకోర్టు పేర్కొంది. ఇప్పటికిప్పుడు విశాఖలో కార్యాలయాల ఏర్పాటు, తరలింపు జరగదని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు విన్నవించిన విషయాన్ని గుర్తు చేసింది. మరోవైపు ప్రస్తుత వ్యాజ్యాలపై విచారణ కోసం త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం తరఫున హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేస్తామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చెబుతున్నారని తెలిపింది. ప్రభుత్వ న్యాయవాదులు చెప్పిన వివరాలను నమోదు చేసింది. 

ప్రధాన వ్యాజ్యాలలోని అనుబంధ పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం నిర్ణయం వెల్లడించేంత వరకు కార్యాలయాల తరలింపు విషయంలో చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. పిటిషనర్ల ఆందోళనను తాము పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. త్రిసభ్య ధర్మాసనం అనుబంధ పిటిషన్లపై విచారణ జరిపేంత వరకు మాత్రమే తాము ఇచ్చిన ఉత్తర్వులు అమలులో ఉంటాయని మౌఖికంగా తెలిపింది. ఈ వ్యవహారమై మరింత స్పష్టతతో ఉత్తర్వులు జారీచేస్తామని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈమేరకు స్పష్టంచేశారు. సీఎం క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటు ముసుగులో విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారంటూ అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్‌ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని ప్రాంత రైతులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details