ఉచిత ఇసుక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్-నేడు హైకోర్టులో వాదనలు - చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 19, 2023, 9:36 AM IST
AP High Court Hearing Chandrababu Anticipatory Bail Petition :ఉచిత ఇసుక విధానం కేసులో ముందస్తు బెయిలు కోసం తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంలో సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ (Advocate General Sriram) హైకోర్టులో రిప్లై వాదనలు వినిపించారు. ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడానికి కారణాలేమిటో పేర్కొనలేదని అన్నారు. వేలం నిర్వహించకుండా ఇసుక రీచ్‌లను అప్పగించారని తెలిపారు. సహజ వనరులు దోపిడీకి గురయ్యాయని అన్నారు. విచక్షణారహిత ఇసుక తవ్వకాలను జాతీయ హరిత ట్రైబ్యునల్ తప్పుపట్టిందని పేర్కొన్నారు. ఎన్జీటీ ఉత్తర్వులను కోర్టు దృష్టికి తెచ్చారు. పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణ నేటికి వాయిదా పడింది.
Chandrababu Sand Case in AP High Court :ఉచిత ఇసుక విధానం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై నేడు హైకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. గత తెలుగుదేశం పార్టీ హయాంలోని ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.