ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP High Court adjourns hearing on TDP NRI Yashaswi Petition

ETV Bharat / videos

ఎన్​ఆర్ఐ యశస్వి పిటిషన్​పై హైకోర్టులో వాదనలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 4, 2024, 6:48 PM IST

AP High Court Adjourns NRI Yashaswi Petition:తనపై సీఐడీ ఇచ్చిన లుక్ ఔట్ నోటీస్​ను ఎత్తివేయాలని కోరుతూ ఎన్​ఆర్ఐ యశస్వి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్​పై నమోదైన కేసులో పిటిషనర్​ను సీఐడీ అరెస్టు చేసి ఇప్పటికే 41ఏ నోటీసు ఇచ్చిందని పిటిషనర్ తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. లుక్ ఔట్ నోటీస్ పర్పస్ సాల్వ్ అయిందని న్యాయవాది కోర్టులో వాదించారు. లుక్ ఔట్ నోటీస్ వల్ల విదేశాలకు వెళ్లాలంటే పిటిషనర్​కు ఇబ్బందులుంటాయని న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. 

ఎన్​ఆర్ఐ యశస్విపై ఉన్న ఎల్వోసీని ఎత్తి వేయాలని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. దీనిపై ఉన్నతాధికారుల సూచనలను తీసుకోవాలని సీఐడీకి న్యాయస్థానం సూచించింది. తదుపరి విచారణను  హైకోర్టు ఈనెల 9కి వాయిదా వేసింది. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని యశస్విపై గత నెలలో సీఐడీ కేసు నమోదు చేసింది. తనపై కేసు నమోదు చేయడంపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. వైఎస్సారీసీపీ పెద్దలు తనను కక్షపురితంగా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ అప్పట్లో యశస్వి ఆరోపించారు. 

ABOUT THE AUTHOR

...view details