ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP Hates CM Jagan

ETV Bharat / videos

AP Hates CM Jagan: 'వై ఏపీ నీడ్స్‌ జగన్'​కి కౌంటర్‌గా.. 'ఏపీ హేట్స్‌ జగన్‌' అంటున్న టీడీపీ - సోషల్ మీడియాలో ఏపీ హేట్స్‌ జగన్‌

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 10, 2023, 3:06 PM IST

AP Hates CM Jagan: వై ఏపీ నీడ్స్‌ జగన్‌ ప్రచారానికి కౌంటర్‌గా.. 'ఏపీ హేట్స్‌ జగన్‌' పేరుతో తెలుగుదేశం ప్రచారం ప్రారంభించింది. జగన్‌ను ఏపీ ప్రజలు ఎందుకు ద్వేషిస్తున్నారనే అంశాన్ని ప్రజలకు వివరించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. సోషల్‌ మీడియాలో కూడా ఏపీ హేట్స్‌ జగన్‌ అనే హ్యాష్‌ ట్యాగుతో ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌పై పార్టీ ప్రచారం చేపట్టనుంది. 'వద్దు బాబోయ్‌ జగన్‌' అని ప్రజలు అంటున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. 

వైసీపీ ప్రతినిధుల సభలో జగన్‌ మాట్లాడిన ప్రతిదీ పచ్చి అబద్దమని ఆయన తెలిపారు. నవరత్నాల్లో ఏ రత్నమైనా నూటికి 10-15 మందికి మాత్రమే దక్కాయని విమర్శించారు. 10 లక్షల కోట్ల మేర తెచ్చిన అప్పులేమయ్యాయని బొండా  నిలదీశారు. 2 లక్షల కోట్లకు పైగా నిధులను డీబీటీల రూపంలో ఇచ్చానని చెబుతున్నారు.. మిగిలిన 7 లక్షల కోట్ల నిధులేమయ్యాయని బొండా ఉమా నిలదీశారు. 7 లక్షల కోట్ల నిధులు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. అన్ని నాశనం చేసిన జగన్‌ ఇంకెందుకని అడుగుతున్నారని అన్నారు. గడప గడపకు కార్యక్రమంలో ప్రజలు అడ్డుకుంటున్నారని.. బస్సు యాత్ర చేస్తున్నారా అంటూ దుయ్యబట్టారు. దళితుడ్ని చంపిన అనంతబాబును పక్కన కూర్చొబెట్టుకున్న జగన్‌ దళిత పక్షపాతా అంటూ బొండా ఉమామహేశ్వరరావు నిలదీశారు.  

ABOUT THE AUTHOR

...view details