ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP_Govt_Stopped_Nagarjuna_Sagar_Water_Release

ETV Bharat / videos

నీటి విడుదలను నిలిపివేసిన ఏపీ అధికారులు - వివాదం పరిష్కారానికి 6న దిల్లీలో సమావేశం - AP Telangana krishna river management board issue

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 3, 2023, 11:26 AM IST

AP Govt Stopped Nagarjuna Sagar Water Release: తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతకు కారణమైన సాగర్‌ కుడికాలువ నీటి విడుదలను ఏపీ అధికారులు అర్ధరాత్రి నిలిపివేశారు. తొలుత నీటి విడుదల కొంతమేర కొనసాగుతుందని ప్రటించినప్పటికీ రాత్రి పదిన్నర గంటల తర్వాత ఆపేశారు. మరోవైపు విజయపురి సౌత్‌ ఠాణాలో తెలంగాణ ఎస్​పీఎఫ్ (Special Protection Force) పోలీసులపై రెండు కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ జలవనరుశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేశారు. 

తెలంగాణ ఎస్​పీఎఫ్ పోలీసులకు చెందిన కొందరు సిబ్బంది తనను కులం పేరుతో దుర్భాషలాడినట్లు ఏఎస్​ఐ సోమ్లా నాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. విజయపురిసౌత్‌ వైపు ప్రాజెక్టు ముఖద్వారంలో ఉన్న పోలీసు కంట్రోల్‌ గార్డు రూమ్​పై ఉన్న పేరును మార్చారు. గతంలో తెలంగాణ ప్రత్యేక పోలీసు గార్డు గది పేరుతో ఉండగా దానిని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ గార్డు గదిగా ఆంగ్ల అక్షరాలతో రాశారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలవివాదంపై సంయమనం పాటించాలని కేంద్రం కోరింది. సమస్యను పరిష్కరించేందుకు ఈ నెల 6వ తేదీన దిల్లీలో సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. 

ABOUT THE AUTHOR

...view details