ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP_Govt_Changed_Diwali_Holiday

ETV Bharat / videos

ఏపీలో దీపావళి పండగ సెలవు 13వ తేదీకి మార్పు - ప్రభుత్వ ఉత్తర్వులు - ఏపీలో దీపావళి సెలవు మార్పు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2023, 7:00 PM IST

AP Govt Changed Diwali Holiday: ఆంధ్రప్రదేశ్​లో దీపావళి పండగ సెలవును ప్రభుత్వం మార్చింది. ఈ నెల 13వ తేదీకి మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary) కెఎస్ జవహర్ రెడ్డి నోటిఫికేషన్​ను విడుదల చేశారు. ఇందుకోసం సాధారణ సెలవులు, ఆప్షనల్ సెలవుల జాబితాలో స్వల్ప మార్పు చేర్పులు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో ఈ నెల 13వ తేదీ సోమవారం ఆప్షనల్ హాలీడే బదులుగా సాధారణ సెలవుగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. 

అయితే గతంలో ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం ఈ నెల 12వ తేదీన ఆదివారం రోజు దీపావళి సెలవుగా ఉంది. ఈ క్రమంలో సాధారణ సెలవులు, ఆప్షనల్ సెలవుల జాబితాలో స్వల్ప మార్పులు చేసి.. నవంబర్‌ 13వ తేదీన సోమవారం రోజు ఆప్షనల్ హాలీడే బదులుగా సాధారణ సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 11వ తేదీన రెండో శనివారం, 12న ఆదివారం కాగా, తాజాగా ప్రభుత్వం 13వ తేదీన సెలవు ప్రకటించడంతో.. ఒకేసారి పండగకు మూడు రోజులు సెలవులు వచ్చినట్లయింది.  

ABOUT THE AUTHOR

...view details