AP FAPTO Leaders Protest in Kurnool: జీవో 117 రద్దు చేయాలని కొవ్వొత్తుల ప్రదర్శన - సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్
AP FAPTO Leaders Protest in Kurnool: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కర్నూలులో శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ వద్ద 12 గంటల పాటు మహా నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. విద్యారంగానికి గొడ్డలిపెట్టుగా ఉన్న 117 జీవోను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు (Teachers want CPS abolished) చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు బదిలీలు చేపట్టి రెండు నెలలు అవుతుందని బదిలీ చేసిన ఉపాధ్యాయులకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో.. ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 117 కారణంగా ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మెకు సైతం వెనకాడమని ఫ్యాప్టో నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.