ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ap

ETV Bharat / videos

AP Disaster MD on Floods: ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం.. సహాయచర్యలకు సిద్ధం: అంబేడ్కర్ - AP Disaster Ambedkar comments

By

Published : Jul 27, 2023, 7:54 PM IST

Updated : Jul 27, 2023, 8:05 PM IST

AP Disaster Management Organization MD Comments: రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణా సంస్థ ఎండీ అంబేడ్కర్ కొన్ని ముఖ్యమైన విషయాలను ఈటీవీ భారత్‌ ద్వారా తెలియజేశారు. అల్పపీడనం బలహీనపడినా కారణంగా తెలంగాణ, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిలోకి ప్రవాహాలు పెరిగే అవకాశం ఉందన్నారు. దీంతోపాటు ధవళేశ్వరం వద్ద కూడా ప్రవాహం 13 నుంచి 15 లక్షల క్యూసెక్కులకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామన్న అంబేడ్కర్.. వరద ఉద్ధృతి మరింత ఎక్కువైతే రెండవ హెచ్చరిక కూడా జారీ చేస్తామన్నారు. పోలవరం ముంపు మండలాల్లో అత్యవసర సహాయ చర్యల కోసం ఇప్పటికే ఎన్‌డీఆర్‌ఎఫ్ (N.D.R.F), ఎస్‌డీఆర్‌ఎఫ్ (S.D.R.F) బలగాలను రంగంలోకి దించామన్నారు. 

ధవళేశ్వరంకి రెండవ హెచ్చరిక జారీ చేస్తాం.. గతకొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు నిండి వరద ప్రహహాలు ఎక్కువవుతున్నాయి. దీంతో పోలవరం ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో విపత్తు నిర్వహణా సంస్థ ఎండీ అంబేడ్కర్ ఈటీవీ భారత్‌తో మాట్లాడుతూ.. ''అల్పపీడనం బలహీనపడింది. నిన్నటితో పోలిస్తే.. ఈరోజు వర్షాలు కాస్త తగ్గాయి. రేపు, ఎల్లుండి కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ, రాష్ట్రంలో అతిభారీ వర్షాలు పడే అవకాశం మాత్రం లేదు. కాకపోతే.. ఎగువన పడుతున్న వర్షాల కారణంగా గోదావరికి వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే భద్రాచలం వద్ద పెరుగుతున్న వరద ప్రహహం కారణంగా ఇప్పటికే రెండవ హెచ్చరికను జారీ చేశారు. ఆ వరద కారణంగా ధవళేశ్వరానికి వరద పెరుగుతోంది. రేపు కూడా భారీ వర్షం కురిస్తే.. ధవళేశ్వరంలో రెండవ హెచ్చరిక జారీ చేస్తాం. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోనేందుకు అన్ని జిల్లాల యంత్రాగాలు సిద్ధంగా ఉన్నాయి'' అని ఆయన అన్నారు. 

Last Updated : Jul 27, 2023, 8:05 PM IST

ABOUT THE AUTHOR

...view details