ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP_Debts

ETV Bharat / videos

కొత్త ఏడాదికి అప్పులతో స్వాగతం పలికిన సీఎం జగన్ - YSRCP Government Debt

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 3, 2024, 12:30 PM IST

AP Debts 2024 :వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రం రికార్డు అప్పులతో దూసుకువెళ్తోంది. 2024లో ప్రవేశించిన రెండో రోజే 3 వేల కోట్ల రుణాన్ని జగన్‌ ప్రభుత్వం సమీకరించింది. ఆ నిధులు రాష్ట్ర ఖజానాకు బుధవారం జమ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరం అప్పుల భారం లక్ష కోట్లకు చేరువవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లోనే అంచనాలకు మించి 20శాతం మేర అప్పు తీసేసుకుంది. చివరి మూడు నెలల్లో మరిన్ని రుణ అనుమతుల కోసం ప్రభుత్వం కేంద్ర ఆర్థికశాఖ వద్ద ప్రయత్నాలు సాగిస్తోంది. ఇప్పటికే వివిధ కార్పొరేషన్ల పేరుతో 25 వేల కోట్లకుపైగా రుణాలు తీసుకున్నారు.  

YSRCP Government Debt :నవంబరు నెలాఖరు వరకు పన్నుల రాబడి మొత్తం 79 వేల కోట్లు ఉంటే రాష్ట్రంలో చేసిన అప్పుల మొత్తం 65 వేల కోట్లుగా ఉందని కాగ్ నివేదికలే పేర్కొంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన మూడు నెలల్లో 18 వేల కోట్ల రూపాయలు కావాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రిజర్వు బ్యాంకుకు వర్తమానం పంపింది. జనవరిలోనే 9 వేల కోట్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. తొలి తొమ్మిది నెలలకు కేంద్రం ఇచ్చిన రుణ పరిమితుల మేరకు అప్పులు పుట్టించిన ప్రభుత్వం ఇప్పుడు అదనపు అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ABOUT THE AUTHOR

...view details