ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP_CRDA_Bond_Rating_Downgraded

ETV Bharat / videos

ఏపీ సీఆర్​డీఏ బాండ్ల రేటింగ్ మరోసారి కుదేలు - బీబీబీ ప్లస్ నుంచి సీ గ్రేడ్‌కు కుదించిన రేటింగ్ ఏజెన్సీలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 2, 2023, 10:15 AM IST

AP CRDA Bond Rating Downgraded to C Grade :ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీ సీఆర్​డీఏకి చెందిన బాండ్ల రేటింగ్ మరోసారి పడిపోయింది. స్టాక్ ఎక్స్చేంజీలో ఏపీ సీఆర్​డీఏ చెందిన 2 వేల కోట్ల రూపాయల విలువైన బాండ్ల రేటింగ్​ను త్రిబుల్‌ బీ ప్లస్ నంచి సీ స్థాయికి తగ్గిస్తున్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఏక్యూటీ తెలిపింది. అక్టోబరు నెలలో సీఆర్డీఏ సరైన చెల్లింపులు చేయకపోవటం, ఇతర సర్వీస్ ఛార్జీల విషయంలో నిర్లక్ష్య కారణంగా రేటింగ్ తగ్గించినట్లు తెలిపింది.

C Grade to APCRDA Bonds in Stock Exchange  2023 : అక్టోబరు నెలాఖరుకు చెల్లించాల్సిన 14.36 కోట్ల కన్సార్షియం లోన్​ను నవంబరు 20 నాటికి చెల్లించారని పేర్కొంది. వాస్తవానికి ఈ రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని రేటింగ్ సంస్థ పేర్కొంది. అలాగే మరో రూ.152 కోట్ల రుణానికి సంబంధించిన చెల్లింపుల హామీ, ఫిబ్రవరి 2024లో చెల్లించాల్సిన బకాయిలు వెరసి 430 కోట్ల రూపాయల ఎస్క్రో ఖాతాల్లో లేవని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. ఈ అంశాలన్నింటిని దృష్టిలో ఉంచుకుని సీఆర్​డీఏ సెక్యూరిటీ బాండ్ల రేటింగ్​ను తగ్గించినట్టు తెలిపింది. రేటింగ్​ను తగ్గించటంలో ఆంధ్రప్రదేశ్ రుణాలకు సంబంధించిన చరిత్రను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు రేటింగ్ ఏజెన్సీ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details