సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ - కొలిక్కి వచ్చిన వాదనలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 1, 2023, 9:06 PM IST
AP CM Jagan Illegal Assets Case: సీఎం జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి నేడు సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. 11 సీబీఐ, 8 ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లలో నిందితుల పిటిషన్లపై విచారణ కొలిక్కి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో జరగగా నిందితుల 127 డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు కొలిక్కి వచ్చాయి.
11 సీబీఐ ఛార్జిషీట్లలో నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లపై, 8 ఈడీ ఛార్జిషీట్లలో నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ కొలిక్కి వచ్చింది. లిఖితపూర్వక వాదనలుంటే ఇవ్వాలని సీబీఐ, ఈడీ, నిందితులకు సీబీఐ కోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి కోర్డు వాయిదా వేసింది. అదే విధంగా హౌసింగ్ ప్రాజెక్టుల ఈడీ ఛార్జిషీట్‌లో ముగ్గురు నిందితులు డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. ముగ్గురు నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లపై ఈ నెల 4వ తేదీన విచారణ జరగనుంది.