AP CID Chief Sanjay on Margadarsi: మార్గదర్శిపై ఫిర్యాదు చేయాలని మేమే చెబుతున్నాం: సీఐడీ చీఫ్ సంజయ్ - మార్గదర్శి చిట్ ఫండ్స్‌పై చందాదారుల ఫిర్యాదులు
AP CID Chief Sanjay on Margadarsi: పోలీసు స్టేషన్‌కు వెళ్లి మార్గదర్శిపై ఫిర్యాదు చేయాలని చందాదారులకు తామే చెబుతున్నాం అని సీఐడీ విభాగాధిపతి ఎన్. సంజయ్ చెప్పారు. మార్గదర్శిపై ఈ మధ్యకాలంలో హైలైట్ చేసి చెబుతుండటం వల్లే ఇప్పుడిప్పుడే ఫిర్యాదులు ఇవ్వడానికి ముందుకొస్తున్నారని తెలిపారు. కొందరి నుంచి అందిన ఫిర్యాదులపై ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలో కొత్తగా మరో మూడు కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఈ కేసుల్లో ఆయా మార్గదర్శి బ్రాంచ్‌ల మేనేజర్లను అదుపులోకి తీసుకున్నారని, వారి అరెస్టును చూపిస్తారని వివరించారు. మిగతా బ్రాంచ్‌ల రికార్డులను పరిశీలించి రాబోయే రెండు, మూడు రోజుల్లో మరికొన్ని కేసులు నమోదు చేస్తారని అన్నారు. తనకు తెలియకుండానే మార్గదర్శిలో చందాదారుగా చేర్చారంటూ సూళ్లూరుపేటకు చెందిన సుబ్రహ్మణ్యం ఫిర్యాదుపై చీరాల ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైందని సంజయ్ తెలిపారు. సీఐడీ ఎస్పీ అమిత్ బర్డర్ మాట్లాడుతూ ఘోస్ట్ చందాదారుల పేరిట మోసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. మార్గదర్శి చిట్ వేలం చాలా సందర్భాల్లో రిగ్గింగ్ అవుతున్నట్లు అనిపిస్తోందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ అన్నారు.