ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ap_bjp_leader_vishnu

ETV Bharat / videos

"ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఆదరించకుంటేనే రాష్ట్రాభివృద్ధి" - YSRCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 31, 2023, 5:53 PM IST

AP BJP Leader Vishnu Kumar Raju:  సీఎం జగన్​ ప్రచార పిచ్చితో కోడి గుడ్డును కూడా వదలటం లేదని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు విమర్శించారు. జగన్​ అధికారానికి రోజులు దగ్గర పడ్డాయని ఆయన విమర్శించారు. ప్రజలు ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఆదరించకుండా ఉండటం వల్లే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నాడని విమర్శించారు. నాలుగున్నరేళ్లుగా సొంత పార్టీ ఎమ్మెల్యేలకే అపాయింట్​మెంట్ ఇవ్వని సీఎం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం బాధాకరమన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి, కులాలకు అతీతంగా ఓటు వేయాలని కోరారు. నూతన సంవత్సరం తర్వాతనైనా జగన్ మారుతారని అనుకుంటున్నాని  విష్ణుకుమార్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మూడు నెలలైనా ముఖ్యమంత్రి ఆరాచకాలను ఆపాలని కోరారు. విశాఖలో చెత్త పేరుకుపోయిందని మండిపడ్డారు. అధికారులు చెత్త ఎత్తుతున్నట్లు ఫొటోలతో ప్రచారం చేసుకుంటున్నారని, నగరంలో ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోయిందన్నారు. ముఖ్యమంత్రి ప్రచార పిచ్చితో కోడిగుడ్డు మీద కూడా తన బొమ్మ వేసుకున్నారని విమర్శించారు.  

ABOUT THE AUTHOR

...view details