ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP_Assembly_Session

ETV Bharat / videos

AP Assembly Session: నేడు మంత్రిమండలి సమావేశం.. రేపటి అసెంబ్లీ సమావేశాలపై చర్చ.. హాజరు కావడంపై నేడు టీడీపీ నిర్ణయం.. - అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ న్యూస్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 20, 2023, 10:13 AM IST

AP Assembly Session: రాష్ట్ర మంత్రి మండలి నేడు సమావేశం కానుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో జరగనున్న ఈ భేటిలో.. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలపై (AP Assembly Session) చర్చించనున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి వివిధ బిల్లులపై మంత్రిమండలి సమీక్షించి ఆమోదం తెలపనుంది. ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Session Start From Tomorrow) జరగనున్నాయి. 

హాజరు కావడంపై నేడు టీడీపీ నిర్ణయం.. కాగా రేపటి నుంచి 27వ తేదీ వరకు జరుగబోయే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా వద్దా అనే అంశంపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా చర్చిస్తోంది. బుధవారం దీనిపై టీడీపీ ఓ నిర్ణయం తీసుకోనుంది. కాగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వైసీపీ వ్యూహ రచన కమిటీ సభ్యులతో నేడు సమావేశమవుతారని తెలుస్తోంది. 

ABOUT THE AUTHOR

...view details