అన్నవరంలో వైభవంగా ప్రారంభమైన సత్య దీక్షధారణ - అన్నవరం తాజా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 7, 2023, 3:56 PM IST
Annavaram Sathyanarayana Swami Satya Diksha: కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి సత్య దీక్షాధారణ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. వందలాది మంది భక్తులు సత్యదీక్షను చేపట్టారు. మొత్తం మూడు రకాలు దీక్షలుండగా.. నేటి నుంచి డిసెంబర్ 4 వరకు 27 రోజుల దీక్ష,.. ఈ నెల 16 నుంచి డిసెంబర్ 4 వరకు 18 రోజుల దీక్ష, ఈ నెల 25 నుంచి డిసెంబర్ 4 వరకు 9 రోజుల దీక్ష భక్తులు చేపట్టనున్నారు. దేవస్థానంలో ఉద్యోగులంతా తప్పనిసరిగా సత్యదీక్ష స్వీకరించాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆలయంలోని ఉద్యోగులంతా దీక్ష చేపట్టారు. గిరిజన ప్రాంతాల్లోని స్వామి భక్తులు కూడా పెద్ద ఎత్తున దీక్షాధారణ చేశారు. వీరికి దేవస్థానం నుంచి ఉచితంగా సత్య దీక్ష వస్త్రాలు, తులసిమాలలు అందించారు.
Satyadiskshalu in Annavaram : భక్తి శ్రద్ధలతో దైవారాధన చేస్తున్న జనాలతో అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో సందడి నెలకొంది. రత్నగిరి కొండపై శ్రీ వీరవెంకట సత్యనారాయణ కొలువై ఉండగా పూజలు వైభవంగా జరుగుతున్నాయి. సత్య దీక్షాధారణ మొదలవడంతో భక్తులతో ఆలయ ప్రాంగణం దైవ నామ స్మరణతో మార్మోగుతోంది.