ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనకాపల్లి మహిళ యోగా టీచర్​

ETV Bharat / videos

Yoga Teacher: ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు.. యోగా టీచర్​గా మారింది - యోగా శిక్షకురాలు

By

Published : Jun 21, 2023, 5:44 PM IST

Ankapalli Woman Yoga Teacher: ఆరోగ్య సమస్యలను శస్త్ర చికిత్సలకు సరిసమానంగా యోగా ద్వారా దూరం చేసుకోవచ్చని అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ మహిళ నిరూపించింది. యోగాతో తన ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవటమే కాకుండా.. ఇతరులకూ యోగా నేర్పుతూ యోగా శిక్షకురాలిగా కూడా మారింది. అనకాపల్లికి చెందిన కరణం దేవిక ఆనే మహిళకు 2011 సంవత్సరంలో వివాహమైంది. ఆ తర్వాత రెండు సంవత్సరాల తనకు సంతానం కలిగిందని.. ఆ సమయంలో జరిగిన శస్త్రచికిత్స వల్ల వెన్నునొప్పి తలెత్తినట్లు వివరించింది. ఆ నొప్పి భరించలేకుండా ఉండటంతో.. యోగా టీచర్​గా పనిచేసే ఆమె భర్త వెన్ను నొప్పిని గమనించినట్లు తెలిపింది. ఆమె భర్త యోగా చేయమని ఆమెకు సూచించటంతో.. 5నెలలు యోగా సాధన చేయటం ప్రారంభించిందని పేర్కొంది. దీంతో ఆమెకు వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభించినట్లు వెల్లడించింది. వెన్నునొప్పి తగ్గటంతో ఆమెకు యోగాపై ఆసక్తి పెరిగిందని అన్నారు. ఆమె లాగా బాధపడుతున్న వారికి.. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి యోగా ద్వారా మార్గం చూపేందుకు పూనుకున్నట్లు తెలిపింది. దీంతో ఆమె 2014 ఆంధ్ర యూనివర్సిటీలో యోగాలో పీజీ డిప్లొమా పూర్తి చేసినట్లు పేర్కొంది. ఆ తర్వాత  2016లో చైనా వెళ్లి అక్కడ యోగా శిక్షకురాలిగా చేరినట్లు వివరించారు. కరోనా సమయంలో స్వదేశానికి తిరిగివచ్చిన ఆమె.. ఇక్కడే శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది. గత సంవత్సరం ఆమెకు మరో సంతానం కలిగినట్లు ఆమె వివరించింది. ఆ సమయంలో కూడా ఆమె యోగాను కొనసాగించటం వల్ల తనకు మొదటి సంతానంలో కలిగినటువంటి.. ఇబ్బందులేమి కలగలేదని వివరించింది.

ABOUT THE AUTHOR

...view details