ఆంధ్రప్రదేశ్

andhra pradesh

dalit_girl

ETV Bharat / videos

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే దళిత బాలికపై అత్యాచారం: వంగలపూడి అనిత - దళిత బాలికపై అత్యాచారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2024, 4:15 PM IST

Anita on Dalit Girl Gang Raped in Visakhapatnam : విశాఖలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరగడం దారుణమని తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత మండిపడ్డారు. రెండు వాారాల క్రితమే బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడమే ఘటనకు కారణమన్నారు. నాలుగున్నరేళ్ల జగన్​ పాలనలో మహిళలపై లెక్కలేనన్ని అరాచకాలు జరుగుతున్నా ఏ మాత్రం కఠిన చర్యలు తీసులేదని దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి జగన్​ మహిళలపై ఎక్కువ దాడులు జరిగే రాష్ట్రంగా ఏపీని మార్చారని అనిత వ్యాఖ్యానించారు. పొట్టకూటి కోసం పక్క రాష్ట్రం నుంచి విశాఖకు వలస వచ్చిన దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరగడం దారుణమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని మహిళ కమిషన్​ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో క్రైమ్​ రేట్​ తగ్గిందని రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఉద్ఘాటించారు. మహిళ రక్షణ కోసం తీసుకువచ్చిన దిశ యాప్​ పని చేసి ఉంటే బాలికపై అత్యాచారం జరిగేదా అని ప్రశ్నించారు. 

ABOUT THE AUTHOR

...view details