ఆంధ్రప్రదేశ్

andhra pradesh

anganwadis_will_indefinite_strike_from_today

ETV Bharat / videos

నాలుగేళ్లయినా తీరని అంగన్వాడీల సమస్యలు - నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె - నాలుగేళ్లైనా తీరని అంగన్వాడీల సమస్యలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 12, 2023, 8:25 AM IST

Updated : Dec 12, 2023, 9:22 AM IST

Anganwadis Will Indefinite Strike From Today: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నిరవధిక సమ్మె బాట పట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో అంగనవాడీల చర్చలు విఫలం కావడంతో సమ్మె చేపట్టాలని మూడు ప్రధాన సంఘాలు నిర్ణయించాయి. వేతనాలు పెంపు, గ్రాట్యుటీ వంటి తదితర ప్రధాన డిమాండ్లపై అంగన్వాడీలు సమ్మెకు చేపట్టనున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో నేటి నుంచి అన్ని అంగన్వాడీ సెంటర్లను మూసివేస్తునట్లు ప్రకటించారు. ప్రాజెక్టు కార్యాలయాల వద్ద అంగన్వాడీలు ఆందోళనలు చేపట్టనున్నారు. 

ప్రభుత్వం దిగొచ్చే వరకూ అంగన్వాడీల ఆందోళన ఆగదంటున్నారు. వేతనాలు పెంచాలని నాలుగు సంవత్సరాల కాలంలో దశల వారీగా చాలా శాంతీయుతంగా అనేక ఆందోళనలు చేశామని అంగన్వాడీలు తెలిపారు. ప్రభుత్వం అంగన్వాడీలను పట్టించుకోకుండా చాలా నిర్భందం ప్రయోగిస్తుందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుకుణంగా వేతనాలు ఇవ్వాలిని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన ఏమి రాకపోవటంతోనే ఈ సమ్మేను చేపడుతున్నామని వెల్లడించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేంత వరకూ ఈ సమ్మే కొనసాగుతుందని అంగన్వాడీ మహిళలు తెలిపారు.

Last Updated : Dec 12, 2023, 9:22 AM IST

ABOUT THE AUTHOR

...view details