ఆంధ్రప్రదేశ్

andhra pradesh

anganwadi_school

ETV Bharat / videos

అంగన్వాడీల సమ్మెతో సచివాలయ సిబ్బందికి తిప్పలు - పిల్లలను బడులకు రప్పించలేక ఆపసోపాలు - prakasam update news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 8:00 PM IST

Anganwadi School :అమ్మ మీ పిల్లలను అంగన్​వాడీ బడులకు పంపించమని సచివాలయ సిబ్బంది తల్లిదండ్రులను అడిగితే, మీరు ఎవరో మాకు తెలిదని సమాధానం ఇస్తున్నారు. ముక్కు, మోహం తెలిని వాళ్లు వచ్చి అడిగితే  మా పిల్లలను ఎలా పంపించాలని ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లల ఆలనా పాలనా మొత్తం అంగన్​వాడీ టీచర్లులకు, ఆయాలకు తెలుసని మీకు ఎలా తెలుస్తుందని అన్నారు. తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు సచివాలయ సిబ్బంది వద్ద సమాధానాలు లేక మౌనంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని సచివాలయ సిబ్బందికి ఈ చేదు అనుభవం ఎదురైంది

Difficulties of Secretariat Staff : ప్రభుత్వ తీరుపై అంగన్​వాడీ కార్యకర్తలు ఆందోళన బాట పట్టిన విషయం తెెలిసిందే. వారి ఆందోళనలతో మూతపడిన అంగన్​వాడీ కేంద్రాలను సచివాలయ సిబ్బంది విధులు నిర్వర్తించేలా రాష్ట్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంగన్​వాడీ కేంద్రాలను మాత్రం తెరిపించారు కానీ అందులో పిల్లలు మాత్రం లేరు. అంగన్​వాడీ కేంద్రాలకు పిల్లలు తీసుకురావాలంటే సచివాలయ సిబ్బందికి కత్తి మీద సాము లాంటిదే. 

ABOUT THE AUTHOR

...view details