ఆంధ్రప్రదేశ్

andhra pradesh

chelluboina

ETV Bharat / videos

Minister chelluboina on Pawan: ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం ఇచ్చిందా..? పవన్​ను ప్రశ్నించిన మంత్రి చెల్లుబోయిన - janasena news

By

Published : Jul 12, 2023, 9:12 PM IST

AP Minister Venugopal fire on Chandrababu and Pawan Kalyan: రాష్ట్ర  సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు సంపద సృష్టించి ఉంటే.. రాష్ట్రంలో ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులూ ఉండేవి కాదు కదా అని ఎద్దేవా చేశారు. విభజన తర్వాత ఆయన రూ.4 లక్షల కోట్లు అప్పు తెచ్చారని..చంద్రబాబు మాటలను రాష్ట్ర ప్రజలు ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదని వెల్లడించారు. 

పవన్‌కు..ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం ఇచ్చిందా.. వాలంటీర్ వ్యవస్థపై ఇటీవలే జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ స్పందించారు. వాలంటీర్స్ అసాంఘిక శక్తులకు వివరాలు ఇస్తున్నారని మాట్లాడిన పవన్‌కు.. ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం ఇచ్చిందా..? అని మంత్రి ప్రశ్నించారు. పవన్ పార్టీ నుంచి రాపాక కిందటి ఎన్నికల్లో అనుకోకుండా గెలిచారని.. ఇంటెలిజెన్స్ బ్యూరో పవన్ కల్యాణ్‌కు జవాబు దారినా..? అని నిలదీశారు. వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని కేబినెట్ సమావేశం ముగిశాక సీఎం జగన్ చెప్పారని మంత్రి పేర్కొన్నారు. ''చంద్రబాబు సంపద సృష్టించి ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులూ ఉండేవి కాదు కదా. విభజన తర్వాత చంద్రబాబు 4 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఆయన మాటలను ప్రజలు ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. చంద్రబాబు మాట్లాడలేనివి పవన్‌ కల్యాణ్‌తో మాట్లాడిస్తున్నారు. వాలంటీర్స్ అసాంఘిక శక్తులకు వివరాలు ఇస్తున్నారన్న పవన్‌కు.. ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఆయనకు జవాబుదారినా..'' అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details