ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Anchor_Anasuya_Inaugurates_MGR_Shopping_Mall

ETV Bharat / videos

ఎంజీఆర్ షాపింగ్ మాల్​లో సందడి చేసిన యాంకర్ అనసూయ - Anasuya Bharadwaj in annamyya district

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2023, 6:57 PM IST

Anchor Anasuya Inaugurates MGR Shopping Mall: ప్రముఖ బుల్లితెర నటి,యాంకర్ ,సినీతార అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) షాపింగ్​ మాల్​లో సందడి చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో నూతనంగా వెలసిన ఎంజీఆర్(MGR) షాపింగ్ మాల్​ను యాంకర్ అనసూయ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంజీఆర్ షాపింగ్ మాల్స్ ఇటీవలే మదనపల్లి,తిరుపతి,రాయచోటి, రాజంపేట ప్రాంతాలలో నూతనంగా ప్రారంభించారని తెలిపారు. నాణ్యమైన,మన్నికైన ఉత్పత్తులను నేటి యువతీ,యువకులకు అందుబాటులో తేవడంలో ఎంజీఆర్ మాల్ ముందుంటుదని అన్నారు. 

MGR Mall Opening in Annamayya District: పర్వదినాలలో ప్రజలు కడప,తిరుపతి,నెల్లూరు ప్రాంతాలకు వెళ్లి బట్టలు కొనుక్కోవాల్సిన పరిస్థితి లేకుండా రాజంపేట పట్టణంలోనే ఎంజీఆర్ మాల్​లో ఏర్పాటుచేశారని తెలిపారు. మహిళలకు రకాల చీరలు,డ్రెస్ మెటీరియల్స్, మగవారికి కావలసిన ప్యాంట్లు,షర్ట్స్,టీ షర్ట్లు అందుబాటులో ఉంటాయన్నారు.అన్ని రకాల వస్త్రాలను  అతి తక్కువ ధరకే సామాన్యులకు ఎంజీఆర్ షాపింగ్ మాల్ అందిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని ఎంజీఆర్ సందర్శించి కావలసిన దుస్తులను ఎంపిక చేసుకోవాలన్నారు. ఎంజీఆర్​లో అన్ని వేడుకలకు కావాల్సిన దుస్తులు దొరుకుతాయని,క్వాలిటీ బావుంటుందని తెలిపారు. అనసూయను  చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ABOUT THE AUTHOR

...view details