ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Anchor_Anasuya_in_Rajamahendravaram

ETV Bharat / videos

రాజమహేంద్రవరంలో అనసూయ సందడి - వస్త్ర దుకాణ ప్రారంభోత్సవానికి హాజరు - Anasuya Sandadi in Rajamahendravaram

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2023, 9:01 AM IST

Anchor Anasuya in Rajamahendravaram : రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద బీఆర్కే వస్త్ర దుకాణాన్ని నటి, ప్రముఖ యాంకర్ అనసూయ ప్రారంభించారు. ప్రముఖ దివంగత వస్త్ర వ్యాపారి బొమ్మన రాజ్ కుమార్ పేరిట ఆయన కుమారుడు బొమ్మన రాము బీఆర్కే షోరూమ్‌ను నిర్మించారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ, వైవిధ్యభరితమైన కొత్త డిజైన్లతో సంప్రదాయం, ఆధునికత కలబోసిన బీఆర్కే షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాజమహేంద్రవరం పరిసరాల్లో తెలుగు సంస్కృతిని ప్రేమించే వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టు అన్ని రకాల  వైరెటీలు ఇక్కడ లభ్యమవుతాయని చెప్పారు. 

అదేవిధంగా బీఆర్కే షాపింగ్‌ మాల్‌ అధినేత బొమ్మన రామచంద్రరావు మాట్లాడుతూ, పూజలు, పండగలు, వివాహాది శుభకార్యాలకు అవసరమైన అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ చీరలు, పురుషులకు, చిన్నారులకు సరికొత్త మోడల్స్‌లో అన్ని రకాల అధునాతన బ్రాండెడ్‌ దుస్తులు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భారత్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) మాజీ చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అనసూయ డ్యాన్స్‌ చేసి అభిమానులను ఉర్రూతలూగించారు. 

ABOUT THE AUTHOR

...view details