ఆంధ్రప్రదేశ్

andhra pradesh

anasuya_cmr_shopping_mall_opening_in_prakasam

ETV Bharat / videos

సీఎమ్మార్ షాపింగ్ మాల్​ ప్రారంభోత్సవంలో యాంకర్​ అనసూయ సందడి - ప్రకాశం జిల్లాలో నటి అనసూయ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2023, 5:22 PM IST

Anchor Anasuya CMR Shopping Mall Opening In prakasam District : ప్రకాశం జిల్లా మార్కాపురంలో నూతనంగా నెలకొల్పిన సీఎమ్మార్ షాపింగ్ మాల్​ను ప్రారంభించారు. నటి అనసూయ, మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథిగా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మంత్రి షాపింగ్​ మాల్​ రిబ్బన్​ కట్​ చేశారు. నటి అనసూయ తదితరులు జ్యోతి ప్రజ్వల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన షాపింగ్​ మాల్​ యాజమాన్యం 28వ బ్రాంచ్ గా ఈ మాల్​ను మార్కాపురంలో నెలకొల్పినట్లు తెలిపారు. మాల్​లో చీరలు, డ్రెస్సులు, వన్​ గ్రామ్ జ్యువెలరీ, మెన్స్ బట్టలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రారంభం అనంతరం షాపింగ్ మాల్ ఎదుట యాంకర్​ అనసూయ సందడి చేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

ఈ సందర్భంగా నటి అనసూయ మాట్లాడుతూసీఎమ్మార్​లో అన్ని వేడుకలకు కావాల్సిన బట్టలు దొరుకుతాయని అన్నారు. తనకు సీఎమ్మార్​లో కొన్న చీరలు అంటే చాలా ఇష్టం అని అన్నారు. తాను మొదటి సారి మార్కాపురం వచ్చానని ఇక్కడ చాలా ఆహ్లాదంగా ఉంది అని సంతోషం వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details