Anantapur Zilla Parishad Chief Electoral Officer Suspended: ఉరవకొండలో ఓట్ల తొలగింపు.. అనంతపురం జడ్పీ ప్రధాన ఎన్నికల అధికారి సస్పెన్షన్ - MLA Payyavula Keshav complaint to ECI
Anantapur Zilla Parishad Chief Electoral Officer Suspended: అనంతపురం జిల్లా పరిషత్ ప్రధాన ఎన్నికల అధికారి కె. భాస్కర్ రెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఉరవకొండ నియోజకవర్గంలో భారీగా ఓట్ల తొలగింపు జరిగిందని.. అంతేకాకుండా చాలావరకు ఓట్లు గల్లంతు అయ్యాయని పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (MLA Payyavula Keshav) గతంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఓట్ల తొలగింపును నిర్ధారించించుకుని చర్యలకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కె. భాస్కర్ రెడ్డిపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ సస్పెన్షన్ వేటు వేశారు.
ఉపాధి కోసమని రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వలస వెళ్లిన వారి.. ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగింపు ప్రక్రియ కొనసాగించినట్లు గతంలో రాజకీయపక్షాలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లాయి. విడపనకల్లు మండలంలోని చీకలగురికి గ్రామంలో ప్రతిపక్షాల సానుభూతిపరుల ఓట్లనే లక్ష్యంగా చేసుకుని తొలగింపు పక్రియ చేపట్టారని ప్రతిపక్షాలు గళమెత్తాయి. ఓటర్లకు ఎలాంటి నోటీసులు అందిచకుండానే ఓట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టారని ఆరోపించాయి.