అనంతపురం పోలీసుల అరుదైన రికార్డు - సెల్ఫోన్ల రికవరీలో నంబర్ వన్ - cell phone recovered in anantapur
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 11, 2023, 7:41 PM IST
Anantapur Police Chat Bot :చాట్ బాట్ సేవల ద్వారా అనంతపురం జిల్లా పోలీసులు మరో అరుదైన రికార్డు సాధించారు. ఎక్కడైనా పోగొట్టుకున్న, అపహరణకు గురైన ఫోన్లను రికవరీ చేయడంలో రాష్ట్రంలోనే ముందంజలో నిలిచారు. రెండేళ్ల క్రితం సెల్ఫోన్ చోరీలు అధికమవుతున్న సమయంలో జిల్లా పోలీసులు చాట్ బాట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సేవల ద్వారా ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు లేకుండా కేవలం వాట్సాప్ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి ఫోన్లు రికవరీ చేస్తున్నారు. అనంతపురం పోలీసులు చేపట్టిన చాట్ బాట్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అమలవుతోంది.
Police Officials Recovered Cell Phone : తాజాగా అనంతపురం జిల్లా పోలీసులు ఫోన్లు రికవరీలో 8 వేల మార్కును దాటారని జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. తాజాగా రూ.71 లక్షల విలువ చేసే 385 సెల్ఫోన్లను బాధితులకు అందజేశారు. రికవరీ చేసిన సెల్ఫోన్లు ఆంధ్రప్రదేశ్లోని 9 జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లినా వదలకుండా రికవరీ చేసినట్లు వెల్లడించారు. సెల్ఫోన్ దుకాణం నిర్వాహకులైనా, వ్యక్తులైనా ఎవరైనా సరే అపరిచితులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయొద్దని సూచించారు. ఫోన్ల విషయంలో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.