Strange incident: భార్య నల్లపూసల గొలుసు మింగేసిన భర్త.. ఆపరేషన్ చేయకుండానే వైద్యం - భార్య గొలుసు మింగేసిన భర్త
Strange incident in Dharmavaram: అనంతపురం జిల్లా ధర్మవరంలో ఓ వింత ఘటన జరిగింది. మతిస్థిమితం లేని ఓ భర్త తన భార్య నల్లపూసల గొలుసును మింగేశాడు. కానీ.. ఆ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. దీంతో ఇటీవల అనారోగ్యం బారిన పడగా.. కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించగా విషయం బయటపడింది. ఆపరేషన్ చేసి గొలుసును బయటకు తీయాలని వైద్యులు తెలిజేయడంతో.. అంత ఖర్చు భరించలేమంటూ.. బాధిత కుటుంబం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. పరిస్థితిని గమనించిన డాక్టర్ సుకుమార్ బృందం.. ఎలాంటి ఆపరేషన్ లేకుండానే నోటి ద్వారా గొలుసును బయటకు తీశారు.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం రాజేంద్రనగర్‌కు చెందిన రామాంజనేయులు మతిస్థిమితం లేని వ్యక్తి. అప్పుడప్పుడూ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఈ క్రమంలో నెల క్రితం తన భార్య నల్లపూసల గొలుసు మింగేశాడు. ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఇటీవల అనారోగ్యం బారిన పడగా..కుటుంబ సభ్యులు బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు పొట్టలో గొలుసును గుర్తించారు. ఆపరేషన్ చేసి గొలుసు బయటకు తీయాలని వైద్యులు చెప్పారు. అంత ఖర్చు భరించలేమంటూ.. బాధిత కుటుంబం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. డాక్టర్ సుకుమార్ బృందం ఎలాంటి ఆపరేషన్ లేకుండానే నోటి ద్వారా గొలుసును బయటకు తీశారు. దీంతో ఆ కుటుంబం వైద్య బృందానికి సంతోషంతో కృతజ్ఞతలు తెలియజేసింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌గా మారింది. ఆ వీడియోలో భర్త మింగేసిన నల్లపూసల గొలుసును భార్య మీడియాకు చూయించింది.