Anam Venkata Ramana Reddy on Jagan: 'జగన్ అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది.. 'సాక్షి'లోకి షెల్ కంపెనీల ద్వారా వందల కోట్ల పెట్టుబడులు'
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 8, 2023, 12:35 PM IST
Anam Venkata Ramana Reddy on Jagan: టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తండ్రి సీఎం పదవిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచేసిన చరిత్ర జగన్‌రెడ్డి సొంతమని.. సాక్షిలోకి 1,256 కోట్ల రూపాయలు పెట్టుబడులు వివిధ షెల్ కంపెనీల నుంచి వచ్చాయని ఆరోపించారు. 2004, 2005, 2006లో వచ్చిన ఈ పెట్టుబడులు.. ఎవరు పెట్టారో తెలియాలన్నారు. 10 రూపాయలు ఉన్న షేరు 350 రూపాయలకు ఎలా వచ్చిందని నిలదీశారు. పలు కంపెనీలు సాక్షిలో పెట్టుబడులు పెట్టాయని అందులో.. విజయసాయి రెడ్డి వియ్యంకుడు అరబిందో సైతం ఉన్నారని తెలిపారు.
అప్పుడే వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో అరబిందోకు సంబంధాలు ఉన్నాయనేది జగమెరిగిన సత్యమన్నారు. అదే విధంగా 22 షెల్ కంపెనీలు సాక్షిలో పెట్టుబడులు పెట్టాయని సాక్షాత్తు సీబీఐనే చెబుతోందని.. ఇవన్నీ చూశాక ఆర్థిక ఉగ్రవాది ఎవరు అనేది వైసీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని అడ్డంపెట్టుకుని షెల్ కంపెనీల నుంచి సాక్షిలోకి పెట్టుబడులు (Shell Companies Investments in Sakshi) వచ్చాయా.. లేదా అని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పాలని ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు.