ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Anam Venkata Ramana Reddy

ETV Bharat / videos

"పేదరికంలో ఉండే సీఎం దంపతులకు భారతి సిమెంట్స్‌లో రూ.4 వేల కోట్ల విలువైన షేర్లు - ఎవరయ్యా పెత్తందారులు?" - Anam omments on cm jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2023, 1:57 PM IST

Updated : Nov 5, 2023, 10:28 PM IST

Anam Venkata Ramana Reddy Fire on CM Jagan :భారతి సిమెంట్స్‌ (Bharati Cements)లో సీఎం జగన్‌ మోహన్ రెడ్డి భారతి దంపతులకు 4 వేల కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని తెలుగుదేశం నేత ఆనం వెంకటరమణారెడ్డి చెప్పారు. కానీ తమకేమీ లేదంటూ ఎప్పుడూ బీద అరుపులు అరుస్తుంటారని విమర్శించారు. మరో అడుగు ముందుకేసి తాను పేదల ప్రతినిధినని, పెత్తందార్లతో యుద్ధం చేస్తున్నానంటూ కబుర్లు చెప్పడం జగన్‌కే సాధ్యమని ఎద్దేవా చేశారు. 

YS Bharathi Salary in Bharathi Cement : భారతీ సిమెంట్స్‌లో వైఎస్‌ భారతికి 49 శాతం వాటా ఉందని, ఫ్రెంచ్‌ కంపెనీకి 51 శాతం వాటా ఉందని తెలిపారు. ఫ్రెంచ్‌ కంపెనీ కంటే భారతీకే ఎక్కువ జీతమని, ప్రతినెలా చెక్కు రూపంలో రూ.32.50 లక్షలు జీతం రూపంలో వస్తుందని.. పేదలెవరో, పెత్తందారులు ఎవరో జగనే చెప్పాలని సూచించాలని అన్నారు. 

1999లో ఫ్రెంచ్‌ కంపెనీ భారతి సిమెంట్స్‌లో రూ.671 చొప్పున షేర్లు కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. 14 ఏళ్ల తర్వాత భారతి సిమెంట్స్‌ షేర్‌ విలువ వెయ్యికి చేరిందన్నారు. దేశంలో బ్యాంకు అప్పులేని ఒకే సంస్థ భారతి సిమెంట్స్‌ అని తెలిపారు.  జగన్‌కు భారతి సిమెంట్స్‌లో 2.38 కోట్ల మేర షేర్లు ఉన్నాయని.. జగన్‌ షేర్ల విలువ రూ.2380 కోట్ల అని తెలిపారు. తనకు ఏమీ లేదని జగన్ ఎన్నికల అఫిడవిట్‌లో చెప్పారని పేర్కొన్నారు. 

ఎప్పుడూ బీద అరుపులు అరిచే జగన్‌ మోహన్ రెడ్డి కుటుంబానికి.. వేలాది కోట్ల టర్నోవర్‌ ఉన్న 17 కంపెనీలు ఎలా వచ్చాయని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. భారతి సిమెంట్స్‌ ద్వారానే ఏటా భారీగా సంపాదిస్తున్నారని.. తెలుగుదేశం నేత ఆనం వెంకటరమణారెడ్డి గుర్తు చేశారు. కానీ జగన్‌ మాత్రం తనకు ఇల్లు, కారు కూడా లేవని ఎన్నికల అఫిడవిట్‌లో ఎలా చెప్పారని నిలదీశారు. 

Last Updated : Nov 5, 2023, 10:28 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details