ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇంకా జమ కాని 'అమ్మఒడి' నిధులు.. ఎండలో బ్యాంకుల వద్ద పడిగాపులు

ETV Bharat / videos

Ammavodi not credited: ఇంకా జమ కాని 'అమ్మఒడి' నిధులు.. బ్యాంకుల వద్ద ఎండలో పడిగాపులు - Ammavodi not credited to mothers account

By

Published : Jul 3, 2023, 3:50 PM IST

Updated : Jul 3, 2023, 5:28 PM IST

Ammavodi not credited to mothers account: ప్రభుత్వం అమ్మఒడి నిధులు విడుదల చేసి 5 రోజులు కావస్తున్నా.. తల్లుల ఖాతాలో నగదు ఇంకా జమ కాలేదు. ఒక వైపు మీ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యాయని బ్యాంకుల వద్దకు వెళ్లి చెక్​ చూసుకోవాలని వాలంటీర్లు చెబుతున్నారు. తీరా అక్కడకు వెళ్లి చూస్తే డబ్బులు జమ అవడం లేదు. గంటల తరబడి ఎండలో క్యూలో నిలబడి.. దగ్గరికి వెళ్లేసరికి అమ్మఒడి డబ్బులు పడలేదని బ్యాంకు సేవా మిత్రలు చెప్పడంతో కంగు తింటున్నారు.. అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో పెద్ద ఎత్తున లబ్ధిదారులు అమ్మఒడి నగదు తీసుకునేందుకు బ్యాంకు మిత్రాల వద్ద బారులు తీరారు. గంటల తరబడి ఎండలో వేచి ఉండి మరీ డబ్బులు పడ్డాయో లేదో అని నిర్ధారణ చేసుకుంటున్నారు. తీరా నగదు ఇంకా జమ కాలేదని సిబ్బంది చెప్పడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. నిధుల జమ విషయంలో ప్రభుత్వ అధికారులు కచ్చితమైన ప్రకటన చేయాలని.. ప్రజల్ని ఇబ్బందులకు గురి చెయ్యొద్దని లబ్ధిదారులు కోరుతున్నారు. 

Last Updated : Jul 3, 2023, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details