ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Amarnath mother Allegations

ETV Bharat / videos

Amarnath mother Allegations: మమ్మల్ని కూడా చంపుతామంటున్నాడు..! అమర్‌నాథ్‌ తల్లి - Amarnath mother alleged on Venkateshwara

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 27, 2023, 6:24 PM IST

 Amarnath mother Allegations: బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజవోలు గ్రామంలో పదవ తరగతి విద్యార్థి ఉప్పాల అమర్‌నాథ్‌ హత్య (Amarnath Murder) ఘటనపై.. నిందితులు రోడ్లపై జల్సా చేస్తున్న వీడియోలు వైరల్​గా మారాయి. ఈ నేపథ్యంలో అమర్​నాథ్ కుటుంబసభ్యలు స్పందించారు. తన కుమారుడి మృతికి తగిన న్యాయం జరగలేదని అతని తల్లి మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగి నాలుగు నెలలు కావస్తున్నా.. నిందితులకు శిక్ష పడలేదని వాపోయారు. తప్పు చేసిన నిందితులు బెయిల్ పై బయటికి వచ్చారని వాపోయింది. తాము చేతికొచ్చిన బిడ్డను కోల్పోయి,  పుట్టెడు శోకంతో ఉంటే... నిందితులు మాత్రం సంతోషంగా, సంబరాలు చేసుకుంటూ బయట తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన నిందితుడు పాము వేంకటేశ్వర రెడ్డి కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులకు గురి చేస్తున్నాడని పేర్కొన్నారు. తనని ఎవ్వరూ ఎం చెయ్యలేరంటూ బాహాటంగానే నిందితుడు చెబుతున్నాడని తెలిపారు. తమ ఇంటివైపు  వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతూ.. భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. అతనికి కఠిన శిక్ష పడేలా చేస్తామని చెప్పిన నాయకులు, అధికారులు తమకు ఎలాంటి న్యాయం చెయ్యలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే.. అలాంటి వారికి ఉరిశిక్ష పడేలా చర్యలు చేపట్టాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details