ఆంధ్రప్రదేశ్

andhra pradesh

1300వ రోజున అమరావతి రైతుల పోరాటం

ETV Bharat / videos

Amaravati Farmers Agitation: అమరావతినే రాజధానిగా కొనసాగించాలి: రైతులు - Amaravati Farmers Latest News

By

Published : Jul 9, 2023, 12:32 PM IST

Amaravati Farmers Protest Reached to : అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ.. రైతులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. రాజధాని రైతులు చేపట్టిన మహోద్యమం 1300వ రోజుకు చేరుకుంది. 1300వ రోజు రైతులు తమ ఆందోళనను కొనసాగించారు. రాష్ట్రం కోసం భూములు త్యాగం చేసిన తమకు సుప్రీం కోర్టులో న్యాయం జరుగుతుందని.. రాజధాని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. R-5జోన్‌ పేరిట పేదలను మభ్యపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ కుట్రలను రాష్ట్ర ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారని అమరావతి రైతులు అన్నారు. మూడు రాజధానుల పేరుతో సీఎం తీసుకున్న నిర్ణయం.. భస్మాసుర హస్తమై ప్రభుత్వాన్ని దహించి వేస్తుందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డిని నమ్మి మోసపోయామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని కోసం ప్రతి ఒక్క ఆంధ్రుని గుండె తపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తీసుకునే తప్పుడు నిర్ణయాలే అతని తలపై పిడుగుపాటుగా మారుతాయని విమర్శించారు. రాష్ట్ర రాజధాని లేకుండా రాష్ట్రాభివృద్ధి జరగదని అభిప్రాయపడ్డారు.  

ABOUT THE AUTHOR

...view details