R5 Zone: అమరావతి రాజధాని విధ్వంసం కోసమే ఆర్5 జోన్: రైతులు
Farmers On R5 Zone: రాజధాని ప్రాంతంలో ఇతరులకు ఇళ్లు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 45ను కొట్టివేయాలని అమరాతి రైతులు పిటిషన్‌లు దాఖలు చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. దీనిపై ఎల్లుండి మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. అమరావతి రాజధానిలో పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదని.. రాజధాని అభివృద్ధి చెయ్యకుండా పట్టాలు ఇవ్వడం నిబంధనలకు విరుద్దమని అమరావతి రైతులు చెబుతున్నారు. ఆర్5 జోన్‌పై ఈరోజు విచారణ జరిపిన హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని తెలిపిందన్నారు. తమకు కోర్టు ద్వారా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని రైతులు చెబుతున్నారు.
అమరావతి రాజధాని విధ్వంసం కోసమే ఆర్5 జోన్‌లు ఏర్పాటు చేశారని రాజధాని రైతులు ఆరోపించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్45 ను కొట్టివేయాలన్నారు. అమరావతి రాజధానిలో వాణిజ్య అవసరాల కోసం ఇచ్చినటువంటి భూమిని ఆర్5 జోన్‌గా ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే పేదలకు నివాసిత ప్రాంతాల్లో ఇళ్లు కట్టించి ఇవ్వాలని తెలిపారు. కోర్టు తీర్పు కోసం వేచి చూడకుండా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు.
ఇవీ చదవండి :