Amaravati Farmers Different Protest Agaist CBN Arrest: బాబు అరెస్టుపై అమరావతి రైతుల వినూత్న నిరసన.. కళ్లు, చెవులు, నోరు మూసుకొని.. - అమరావతి లేటెస్ట్ న్యూస్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 2, 2023, 4:13 PM IST
Amaravati Farmers Different Protest Agaist CBN Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ రాస్తారోకోలు, రిలే దీక్షలు, ఆందోళనలు హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబుకు మద్దతుగా అమరావతి ప్రాంతంలో రైతులు వినూత్న రీతిలో నిరసనలు చేపట్టారు. రాజకీయ కక్షతో చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. తుళ్లూరులో రైతులు గాంధేయ మార్గంలో నిరసన వ్యక్తం చేశారు. కళ్లు, చెవులు, నోరు మూసుకొని నిరసన తెలిపారు. "సైకో పోవాలి.. సైకిల్ రావాలి" అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. చంద్రబాబును విడుదల చేసేంత వరకు తమ ఉద్యమం ఆగదని రైతులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెంటే తాము నడుస్తామని రాజధాని రైతులు ప్రతిజ్ఞ చేశారు. మందడంలో న్యాయదేవత విగ్రహం వద్ద రైతులు నిరసన తెలిపారు.