ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Amaravathi_Farmers_Meet_Lokesh_Bhuvaneswari

ETV Bharat / videos

Amaravathi Farmers Meet Lokesh Bhuvaneswari: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ది చెప్తాం.. నారా భువనేశ్వరి, లోకేశ్‌లతో అమరావతి రైతులు - Amaravathi Farmers Meet Lokesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 6, 2023, 6:06 PM IST

Amaravathi Farmers Meet Lokesh Bhuvaneswari: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ.. అమరావతి రైతులు, మహిళలు రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి, లోకేశ్‌లను కలిసి తమ మద్దతు తెలిపారు. ఎలాంటి తప్పు చేయని చంద్రబాబుపై కక్షపూరితంగా కేసులు పెట్టి, జైలుకు పంపించారని మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా వైఎస్సార్సీపీకి తగిన బుద్ధి చెప్తామని శపథం చేశారు.

Amaravati Farmers Fire on YSRCP Government: అమరావతి రైతులు రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి, లోకేశ్‌లను కలిసి తమ మద్దతు తెలిపారు. అమరావతి ప్రాంతం నుంచి రెండు బస్సుల్లో వెళ్లిన రైతులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం చంద్రబాబు కుటుంబ సభ్యులను కలిసి సంఘీభావం తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని శపథం చేశారు. అమరావతి అభివృద్ది కోసం ఎంతో కృషి చేసిన చంద్రబాబును తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలయ్యే వరకూ నిరసనలు, ఆందోళనలు చేస్తామని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details