ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Alumni_Association_Meeting_at_AU

ETV Bharat / videos

ఏయూలో పూర్వ విద్యార్థుల సంఘం సమావేశం - ముఖ్య అతిథిగా టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ - AP Latest News

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 10, 2023, 12:22 PM IST

Alumni Association Meeting at AU : విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల సంఘం సమావేశం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలాగే ఏయూ(AU) పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, జీఎంఆర్ (GMR) గ్రూప్‌ సంస్థల వ్యవస్థాపకుడు గ్రంధి మల్లికార్జున రావు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  

చంద్రశేఖరన్‌ మాట్లడూతూ, యువత తమ శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను వాడుకోవాలని కోరారు. దేశంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిని సరైన మార్గంలో అందుకునే విధంగా యువత ఉండాలన్నారు. పారిశ్రామికీకరణ, మేధో హక్కులు, అంకుర సంస్థలు, విద్యా ప్రణాళిక ఇలా అన్ని ఒకదానికొకటి ముడిపడి ఉన్న అంశాలేనని వీటికి సాంకేతికత కొత్త మార్గాన్ని నిర్దేశిస్తుందని వివరించారు. విదేశాలతో పోలిస్తే మన యువత తమ శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోగలిగితే ఇక తిరుగు ఉండదని చెప్పారు. యువత చిన్న చిన్న వాటికి కుంగిపోవడం లాంటి బలహీన మనస్తత్వం నుంచి బయటకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాల ప్రముఖులు విద్యార్థులు హాజరయ్యారు. 

ABOUT THE AUTHOR

...view details