ఆంధ్రప్రదేశ్

andhra pradesh

all_party_meeting

ETV Bharat / videos

All Party Meeting Under Jai Bheem Bharat Party ఎన్నికల నాటికి ప్రతిపక్షనేతలందరిని అరెస్టు చేసి, జైళ్లో పెడతారా..? : జడ శ్రావణ్‌కుమార్‌ - Jada Shravankumar

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 23, 2023, 4:59 PM IST

All Party Meeting Under the Auspices of Jai Bheem Bharat Party:ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వ్యూహాలు చేయకుండానే ప్రతిపక్ష నేతను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయించిందని జైభీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌ అన్నారు. చంద్రబాబు అరెస్టు అక్రమంగా జరిగిందని ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేయజడాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలో ఓ మాజీ ముఖ్యమంత్రినే ఎలాంటి అవినీతి చేయకున్నా అరెస్టు చేయగలిగితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రశ్నించిన వారిమీద కేసులు పెట్టి మానసికంగా వేధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జై భీమ్‌ భారత్‌ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక పేరిట అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు సహా ఇతర పార్టీల ప్రతినిధులు, మేధావులు సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టు సహా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న అరాచకాలను, అక్రంమాలను ముక్తకంఠంతో ఖండించారు.

ABOUT THE AUTHOR

...view details