ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నాటకోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి - అవార్డులకు సిఫార్సు చేస్తే రాజీనామా చేస్తా : పోసాని

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 12:37 PM IST

nandi_natakotsavam

All Arrangements Set For Nandi Natakotsavam in AP:రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళి తెలిపారు. ఇవాళ్టి నుంచి ఈనెల 29వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని గుంటూరులోని ప్రదర్శనల ప్రాంగణం శ్రీ వెంకటేశ్వర మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఇవాళ ఉదయం బలిజేపల్లి లక్ష్మీకాంతం కళాప్రాంగణంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 38 నాటక సమాజాల నుంచి 1200 మంది కళాకారులు పాల్గొంటారని వివరించారు. గతంలో నంది అవార్డుల చుట్టూ వివాదాలు ఉండేవన్నారు. సమయం తక్కువగా ఉండటంతో సినిమాలకు కాకుండా కేవలం నాటకాలకు మాత్రమే అవార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. అవార్డులకు ఎలాంటి సిఫార్సులు చేయొద్దని ఎవరైనా ఒత్తిడి తెస్తే రాజీనామా చేస్తాను అని అన్నారు. రేపటి నుంచి గుంటూరులో నంది నాటకోత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. నాటకోత్సవాల ద్వారా కళాకారులకు మంచి వేదిక దొరుకుతుందని పోసాని కృష్ణమురళి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details