AISF Protest On Medical seats issue In Vijayawada ఉచితవిద్య అంటూ, మెడికల్ సీట్లను అమ్మడమేంటీ..? ఏఐఎస్ఎఫ్ నిరసన.. - విజయవాడ ధర్నా చౌక్‌లో ఏఐఎస్ఎఫ్ నిరసన
AISF Protest On Medical seats issue: రాష్ట్రంలోని మెడికల్ సీట్లను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించడాన్ని ఖండిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసన కార్యక్రమం చేపట్టింది. డబ్బు దండుకోవడం కోసమే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని వైద్య కళాశాల్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్లను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించిందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సాయికుమార్ ఆరోపించారు. ప్రభుత్వం ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. ఈ జీవోను ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున్న ఆందోళనలు చేపడతామని సాయికుమార్ హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఉచితంగా విద్యను అందిస్తానని చెప్పిన సీఎం మాట తప్పరని ఆయన అన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి తమ పూర్తి సంఘీభావం తెలుపుతున్నట్లు పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ప్రకటించారు. సీఎం జగన్ ఈ జీవోతో పేదవాడికి వైద్య విద్యను దూరం చేస్తున్నారని ఆయన విమర్శించారు.