Aidwa Round Table Meeting: 'మహిళల రక్షణకు చర్యలు లేవు.. మద్యపాన నిషేధమూ లేదు' - కర్నూలు జిల్లా తాజా వార్తలు
Aidwa Round Table Meeting In Kurnool: మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో కర్నూలులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఐద్వా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం విధిస్తామని సీఎం జగన్ చెప్పిన మాటను గుర్తు చేసిన ఐద్వా రాష్ట్ర నాయకురాలు నిర్మలమ్మ .. ఆ హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్యం అరికట్టేందుకు ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. మద్యం పేరు మీద సీఎం జగన్ రూ.25వేల కోట్లు అప్పు చేసినట్లు ఆమె ఆరోపించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నివాసముండే తాడేపల్లిలోనే మహిళలపై దాడులు జరుగుతుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్రంలో మద్యం అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఐద్వా ఆధ్వర్యంలో పోరుయాత్ర చేస్తునట్లు మహిళా సంఘాల నేతలు తెలిపారు.