ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Agriculture Minister Kakani Govardhan Reddy

ETV Bharat / videos

కరవు మండలాల్లో లేని ప్రాంతాలకు ఇన్​పుట్​ సబ్సిడీ ద్వారా నష్టం భర్తీ: మంత్రి కాకాణి - ఏపీ వైసీపీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2023, 9:17 PM IST

Agriculture Minister Kakani Govardhan Reddy:డిసెంబరు 1వ తేదీ నాటికల్లా ఖరీఫ్ పంట నష్టపోయిన రైతుల జాబితాను సిద్ధం చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. రబీలో ప్రత్యామ్నాయ పంటలపై ప్రణాళిక సిద్ధమైందని.. దీనిపై రైతుల్లో అవగాహన కల్పిస్తామని మంత్రి తెలిపారు. సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో కరవు పరిస్థితులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రకటించిన 7 జిల్లాలోని 103 కరువు మండలాల్లో నెలకొన్న పరిస్థితులు, ఖరీఫ్ పంట నష్ట అంచనా పనులపై మంత్రి సమీక్షించారు. 

కరవు మండలాలుగా ప్రకటించని మండలాల్లో జరిగిన నష్టాన్ని కూడా ఇన్​పుట్​ సబ్సిడీ ద్వారా భర్తీ చేస్తామని అన్నారు. కరవు పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అవసరమైన సాయం కోసం కేంద్రానికి త్వరలో నివేదిక పంపనున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర బృందం రాష్ట్రంలో త్వరలో పర్యటిస్తుందని.. ఇన్​పుట్​ సబ్సిడీ, రుణాల రీషెడ్యూలింగ్, ఉపాధి హామీ పనులను 100 నుండి 150 రోజులకు పెంచే కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details