ఉరవకొండ పోలీసు స్టేషన్ బాధితులు ధర్నా - న్యాయం చేయాలని డిమాండ్ - ఉరవకొండ పోలీస్ స్టేషన్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 3, 2024, 1:39 PM IST
Agitation in Front of The Police Station : అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం సాయంత్రం ఓ కుటుంబం ఆందోళనకు దిగింది. శ్రీనివాసులు అనే వ్యక్తి తరచూ వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆవేదనా వ్యక్తం చేశారు. గతేడాది నవంబరులో శ్రీనివాసులు కత్తితో పొడిచారని దీనిపై పోలీసులు నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేసినా అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. రెండు వారాల క్రితం కులం పేరిట దూషిస్తూ వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి పోలీసులను ఆశ్రయించినా ఎలాంటి ఫలితం లేదన్నారు.
న్యాయం చేయాలంటూ శ్రీకాంత్, అతని భార్య చంద్రకళ బంధువులతో కలిసి మంగళవారం పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. కత్తితో పొడిచి, కులం పేరుతో దూషించునందుకు శ్రీనివాసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని బాధితులు పోలీసులను కోరుకున్నారు. పోలీసులు సర్ది చెప్పినా వినకుండా స్టేషన్ ఎదుట రహదారిపై బైఠాయించడం వల్ల కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు అక్కడి నుంచి శ్రీనివాసులు ఇంటికి వెళ్లి నిరసన తెలిపారు. పోలీసులు జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.