వైసీపీ నేతలు స్థలాన్ని ఆక్రమించారంటూ దళితుల ఆందోళన - ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు - ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి భూ ఆక్రమణలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 2:36 PM IST
Agitation Against MLA Gopireddy Srinivasa Reddy: పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట క్రిస్టియన్ పాలెంకు చెందిన దళితులు ధర్నాకు దిగారు. వైసీపీ నేతలు తమ స్థలాన్ని ఆక్రమించారని చేశారని దళితులు ఆరోపించారు. వైసీపీ నేతల నుంచి తమ స్థలాన్ని విడిపించాలని దళితులు డిమాండ్ చేశారు. బాధితులు మున్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయించి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
క్రిస్టియన్ పాలెం వాసుల ధర్నాకు మద్దతు తెలుపుతూ నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ చదలవాడ అరవింద బాబు, పలు ప్రజా సంఘాల నేతలు ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం చదలవాడ అరవింద బాబు మీడియాతో మాట్లాడారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగడాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయని దుయ్యబట్టారు. పట్టణంలో ఎక్కడ స్థలాలు చూసినా గోపిరెడ్డి అక్రమంగా ఆక్రమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగున్నర ఎకరాలు ప్రభుత్వం భూమిని సైతం వైసీపీ నేతలు ఆక్రమించారని మండిపడ్డారు. దీని విలువ సుమారు 30 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు.