ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Agitation against Deputy CM Narayanaswamy

ETV Bharat / videos

జగనన్న ముద్దు - నారాయణస్వామి వద్దే వద్దు! - chittor news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2024, 7:20 PM IST

Agitation against Deputy CM Narayanaswamy: ఇప్పటి వరకూ ఎమ్మెల్యేలు, మంత్రుల సేవలు తమకు వద్దంటూ నిరసన కార్యక్రమాలు చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు తాజాగా ఉపముఖ్యమంత్రి సేవలు తమ నియోజకవర్గానికి వద్దంటూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. 'ముఖ్యమంత్రి ముద్దు ఉపముఖ్యమంతి సేవలు  వద్దంటూ' ఆందోళన చేపట్టిన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.  

 చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్​ఛార్జ్​గా ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అభ్యర్థిత్వంపై వ్యతిరేకత మెుదలైంది. నారాయణస్వామికి వ్యతిరేకంగా పెనుమూరు మండలం పులిగుండు వద్ద వైఎస్సార్సీపీ అసమ్మతి నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ అసమ్మతి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగనన్న ముద్దు,  నారాయణస్వామి వద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి నియోజకవర్గంలోని  కులాలు, ఆత్మీయుల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి సేవలు తమ నియోజకవర్గానికి అవసరం లేదని వైఎస్సార్సీపీ నేతలు తేల్చి చెప్పారు. సీఎం జగన్ ఈ అంశంపై సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. నారాయణస్వామికే మళ్లీ టికెట్ ఇస్తే పార్టీ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.  

ABOUT THE AUTHOR

...view details