ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Advocates_Protest_in_Kurnool_about_Land_Ownership_Act

ETV Bharat / videos

భూయాజమాన్య హక్కు చట్టాన్ని రద్దుపై నాలుగో రోజుకు చేరుకున్న లాయర్ల పోరాటం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2023, 5:12 PM IST

Advocates Protest in Kurnool about Land Ownership Act: భూయాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కర్నూలులో న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ చట్టం వల్ల సివిల్ కోర్టులకు భూ తగాదాల కేసులు విచారించే అవకాశం లేదని, రెవెన్యూ ట్రిబ్యునల్స్ మాత్రమే పరిష్కరిస్తాయని లాయర్లు గుర్తు చేశారు. దీని వల్ల అధికార పార్టీ నేతలకే న్యాయం లభిస్తుందని సాధారణ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని స్పష్టం చేశారు. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా భూ కబ్జాదారులకు అనుకూలమైన చట్టాన్ని రద్దు చేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

512జీవో వల్ల ప్రజలకు నష్టం తప్ప లాభం లేదని కాబట్టి వెంటనే రద్దు చేయాలని లాయర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ జోవో రద్దు చేసేంతవరకూ పోరాటాన్ని ఆపమని లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు న్యాయం చేయడానికి చట్టాలను తీసుకువస్తారు కాని ఈ జీవో వల్ల మరిన్ని సమస్యలు ప్రజలు ఎదుర్కొంటారని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అడ్డగోలు జీవోలను తీసుకొస్తూ రాక్షస పాలన చేస్తుందని లాయర్లు మండిపడుతున్నారు.  

ABOUT THE AUTHOR

...view details