Advocate Sunkara Rajendraprasad on CBN Cash Petition: స్కిల్ కేసు క్వాష్ చేయడానికి సెక్షన్ 17 ఏ ఒక్కటే ఆధారం: న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ - Advocate Sunkara Rajendraprasad news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 9, 2023, 8:18 PM IST
Advocate Sunkara Rajendraprasad on CBN Cash Petition: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తనపై సీఐడీ అక్రమ కేసు నమోదు చేసిందని.. దానిని కొట్టేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. అయితే, నేటి విచారణలో న్యాయవాదులు ఏ అంశంపై వాదనలు వినిపించారు..? 17ఏ సెక్షన్ చంద్రబాబుకు వర్తిస్తుందా..? లేదా..? గవర్నర్ అనుమతి లేకుండా పిటిషనర్‌ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేయటం సరైందేనా..? అనే అంశాలపై హైకోర్టు సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ ఈటీవీ భారత్‌తో ముచ్చటించారు.
Sunkara Rajendraprasad Comments:న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ''సెక్షన్ 17ఏ చుట్టూనే సుప్రీంకోర్టులో వాదనలు సాగాయి. స్కిల్ కేసు క్వాష్ చేయడానికి సెక్షన్ 17 ఏ ఒక్కటే ఆధారం. స్కిల్ కేసుకు సెక్షన్ 17 ఏ తప్పకుండా వర్తిస్తుంది. ప్రజా సేవకులపై కక్షగట్టి కేసులు పెట్టకుండా ఈ చట్టం కాపాడుతుంది. గతంలో పదవిలో ఉండి.. ఇప్పుడు లేకున్నా ఈ చట్టం వర్తిస్తుంది. గవర్నర్ అనుమతి లేకుండా పిటిషనర్‌ను సీఐడి అధికారులు అరెస్ట్ చేయటం, కోర్టు రిమాండ్ విధించటం నిబంధనలకు విరుద్ధం. ముఖ్యమంత్రి హోదాలో తీసుకున్న నిర్ణయాలకు పిటిషనర్‌ను బాధ్యుడ్ని చేసి, అన్యాయంగా కేసు నమోదు చేశారు'' అని ఆయన అన్నారు.